వైసిపికి జ్యోతుల నెహ్రూ గుడ్ బై |
ఊహించిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా, పార్టీ శాసనసభ పక్ష ఉపనేతగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన పార్టీ తో పాటు ఈ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి పంపిన లేఖలో తెలియపర్చారు. పార్టీ అంచనాల మేరకు తాను పనిచేయలేకపోతున్నానని కూడా పేర్కొన్నారు.
శాసన సభలో సమావేశాలలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో పాల్గొనడమే కాకుండా వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు విప్ జారీచేసింది. కానీ ఈ సమావేశాలకు జ్యోతుల నెహ్రూతో పాటు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గైర్హాజరయ్యారు. దీంతో వారు పార్టీని వీడుతున్నట్టు తెలిసిపోయింది. ఈ సమావేశాల్లో టిడిపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది కూడా నెహ్రూ నే కావడం విశేషం.

Post a Comment