బడ్జెట్ నిర్వహణలో లోపాలు |
తెలంగాణకు రాష్ట్రానికి చెందిన తొలి బడ్జెట్ (2014-15) కు సంబంధించిన భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలను ప్రభుత్వం బుధవారం శాసన సభ,శాసన మండలిలో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక లో ముఖ్యాంశాలు
- తెలంగాణ బడ్జెట్ ని లక్షకోట్లుగా చూపించగా కేవలం 60,529 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేయగలిగారు. అవాస్తవిక అంచనాలు, నిర్వహణా లోపాలు దీనికి కారణమని కాగ్ నివేదిక ఆక్షేపించింది.
- తెలంగాణ ప్రభుత్వానికి 2015 మార్చ్ వరకు 79,880 కోట్ల రుణాలున్నాయి. ఈ రుణాల్లో సగానికి పైగా వచ్చే ఏడేళ్లలోనే తిరిగి చెల్లించాల్సి ఉన్నందున ద్రవ్య క్రమశిక్షణ పాటించవలసి ఉంది.
- ప్రభుత్వం ప్రకటించిన విధాన నిర్ణయాలేవి అమలు కావడం లేదు. కీలకమైన మిషన్ భగీరథ, హరితహారం, కల్యాణలక్ష్మి లాంటి పథకాలకు కూడా కేటాయించిన నిధులను ప్రభుత్వం వినియోగించ లేక పోయింది. యాదగిరి గుట్ట ఆలయానికి 200 కోట్లను బడ్జెట్ లో చూపించి, 100 కోట్లను విడుదల చేసినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. హరితహారానికి 300 కోట్లను బడ్జెట్ లో చూపించి, 150 కోట్లను విడుదల చేసినా, కేవలం 33 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టగలిగారు.
- విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ రంగానికి కేటాయింపులు, ఖర్చు మిగతా రాష్ట్రాల కంటే బాగా తక్కువగా ఉన్నాయి .
- విలువ ఆధారిత పన్ను(VAT), రిజిస్ట్రేషన్ దస్తావేజులపై స్టాంపు డ్యూటీ, రవాణా పన్నులు, సుంకాల వసూళ్లలో అనేక లోపాలున్నాయి. వీటిని సత్వరమే సరిచేసుకోవాలి.
- తెలంగాణ అమరవీరుల కుటుంబాలలో 1,000 కుటుంబాలకు 10లక్షల రూపాయల చొప్పున సాయం చేయటానికి 100కోట్లు కేటాయించినా, కేవలం 430 కుటుంబాలకే పంపిణీ చేశారు.
Post a Comment