ఆర్ధిక పరిస్థితి అదుపు తప్పింది

ఆర్ధిక పరిస్థితి అదుపు తప్పింది
ఆర్ధిక పరిస్థితి అదుపు తప్పింది
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొలి బడ్జెట్ (2014-15)  కు సంబంధించిన  భారత కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక లో ముఖ్యాంశాలు
  • ఆంధ్రప్రదేశ్‌ కు ఉన్న అప్పులు, ఆదాయం మధ్య సమతౌల్యం లోపించింది. ప్రభుత్వానికి 2015 మార్చి 31 నాటికి  ఉన్న మొత్తం అప్పులు 1,07,637 కోట్ల రూపాయలు. వీటిలో 55,618 కోట్లను ఏడేళ్లలోనే చెల్లించాల్సి ఉంది. వీటికి రాబోవు సంవత్సరాలలో తీసుకునే స్వల్పకాలిక అప్పులు తోడైతే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల కోసం  తీసుకున్న బడ్జెటేతర రుణం రూ.7,162 కోట్లకు చేరింది.
  • రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే FRBM నిబంధనలను దాటి ఎక్కువ అప్పులు తీసుకుంది. సత్వరమే ఖర్చులు తగ్గించుకుని చెల్లింపులు చేపట్టక పొతే భవిష్యత్తు లో వడ్డీ భారాన్ని భరించేంత ఆదాయం కూడా రాష్ట్రానికి ఉండదు. అప్పు జీఎస్‌డీపీలో 32.03 శాతానికి చేరింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇది 27.60 శాతాన్ని దాటకూడదు.
  • రాష్ట్రం రెవిన్యూ లోటు తో ఉంది. లోటు ఏకంగా 24,194 కోట్ల రూపాయలు ఉండటం ప్రమాద సంకేతమే. ఆర్ధిక లోటు  6.10 శాతానికి చేరింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇది 3 శాతాన్ని దాటకూడదు.
  • 13 వ ఆర్థిక సంఘం గ్రాంట్లను ఉపయోగించుకోలేకపోయారు. 10,611.35 కోట్ల గ్రాంటుకు గాను 7,665.84 కోట్లు మాత్రమె తెచ్చుకోగలిగారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపక పోవటం, ఇతర నిబంధనలు పాటించక పోవటం దీనికి కారణాలు. వీటిని వెంటనే సరిచేసుకోవాలి.
  • రెవిన్యూ రాబడి అంచనాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. 92,078 గాను 90,672 కోట్లు మాత్రమె వచ్చాయి. రెవిన్యూ వ్యయం ప్రభుత్వానికి అదుపు లేదు. అంచనా 98,142 కోట్లు ఉండగా ఖర్చు 1,14,866 కోట్లకు చేరింది. వ్యయం జీఎస్‌డీపీలో 22.09 శతం కాగా, దీనిలో 78.94 శాతం రాబడి ఉండగా 24,194 కోట్లు అప్పు తెచ్చారు.
  • అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు కొరత వల్ల సరిగ్గా విడుదల కాలేదు. వాస్తవ కేటాయింపులకే నిధులు లేనప్పుడు బడ్జెట్ లో అనుబంధ కేటాయింపులు చేయడం అనవసరం. అంతేకాకుండా అసెంబ్లీ ఆమోదం లేకుండా 13,134.68 కోట్లు ఖర్చు చేశారు. చివరి నిమిషంలో ఎక్కువ ఖర్చు చేసే పద్దతిని విడనాడాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post