తమ్ముడికి ప్రచారం కల్పిస్తున్న సొనమ్ కపూర్ |
బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్, మీర్జ్యా అనే సినిమాతో పరిచయం కానున్నారు. ఇది ఒక ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమాలో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి రంగ్ దే బసంతి, ఢిల్లీ6, భాగ్ మిల్ఖా భాగ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేష్ ఓం ప్రకాశ్ దర్శకత్వం వహితున్నాడు. మ్యూజిక్ శంకర్, ఎస్సాన్, లాయ్ లు అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది.
ఇప్పటికే అనీల్ కపూర్ కూతురు, హర్ష వర్ధన్ సోదరి సొనమ్ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. సొనమ్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.
Introducing @harshvardhankapoor ! #mirzya Kya baat hain bhai!! https://t.co/FdMABdkqZE pic.twitter.com/HcMfTeXbar— Sonam Kapoor (@sonamakapoor) March 30, 2016
Post a Comment