హైదరాబాద్ మేయర్ కు హెల్మెట్ లేనందుకు ఈ - చలాన్

హైదరాబాద్ మేయర్ కు లేనందుకు హెల్మెట్ ఈ - చలాన్
హైదరాబాద్ మేయర్ కు హెల్మెట్ లేనందుకు ఈ - చలాన్
హైదరాబాద్ మేయర్  బొంతు రామ్మోహన్‌ రాత్రి వేళ  బైక్ పై ప్రయాణిస్తూ ఆక‌స్మిక త‌నిఖీల పేరిట పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేస్తున్నారా, ఎంతమంది కార్మికులు హాజరవుతున్నారు, కార్మికుల సంఖ్యను సరిగానే చూపిస్తున్నారా? ఎక్కువ చేసి చూపిస్తున్నారా? లాంటివి చెక్ చేస్తున్నారు. అయితే ఈ సమయం లో హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావటం తో  నెటిజన్లు హైదరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీసుల పై సామాన్యుడికి ఓ రూల్, మేయర్ కు మరో రూలా అంటూ విరుచుక పడుతుండటంతో, పోలీసులు మేయర్ ఇంటికి ఈ-చలానా పంపించినట్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post