మిషన్ కాకతీయ కు కేంద్రం నుంచి PMKSY నిధులు

మిషన్ కాకతీయ కు PMKSY  నిధులు
మిషన్ కాకతీయ కు PMKSY  నిధులు
నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు కృషి ఫలిస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం (PMKSY) కింద మిషన్ కాకతీయలో భాగం గా 182 చెరువుల పునరుద్ధరణ కోసం 21 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వుల కాపీ అందింది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ రెండో దశలో భాగంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణకు 140.57 కోట్ల రూపాయల్ని మంజూరు చేసింది.

0/Post a Comment/Comments