సంక్షోభంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం |
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. తొమ్మిది మంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే లు తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైనా అవిశ్వాసానికి నిరాకరించిన స్పీకర్ గోవింద్ సింగ్ బడ్జెట్ ఆమోదం పొందినట్టుగా ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ భగత్ సింగ్ కోషియారి, శ్యాం జాజు, జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్గీయ లతో కూడిన ముగ్గురు సభ్యుల బీజేపీ ప్రతినిధివర్గం గవర్నర్ కేకే పాల్‌ను కలిసి ప్రస్తుత ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరింది.
Post a Comment