దశ వసంతాల ట్విట్టర్

దశ వసంతాల ట్విట్టర్
దశ వసంతాల ట్విట్టర్
 ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలకు ఊపిరి పోసిన ట్విట్టర్ సోమవారంతో పదేళ్లు పూర్తిచేసుకోబోతోంది. 2006 వ సంవత్సరం లో స్థాపకుల్లో ఒకరైన జాక్ డోర్సే “just setting up my twttr” అనే ట్వీట్ తో ఈ సంస్థ ప్రారంభమైంది.

ఈ పది సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిష్ర్కమణం, తగ్గిన సిబ్బంది సంఖ్య వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుకుంది. ఆదాయం బాగానే ఉన్నా సంస్థ నష్టాల్లోనే వుంది. కొత్త ట్విటర్ ఖాతాదారులను పెంచుకోవడంలోనూ ఇప్పటికీ కష్టపడుతోంది. ఫేస్‌బుక్‌ పోటీని  తట్టుకుని సామాజిక మాధ్యమంగా అగ్రస్థానంలో నిలబడేందుకు శ్రమిస్తోంది. ఈ సంస్థ భవిష్యత్తు లో ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని ఆశిద్దాం.

0/Post a Comment/Comments

Previous Post Next Post