ప్రభుత్వ స్కూళ్ళలోనూ ప్రీ ప్రైమరీ |
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ స్కూళ్ళను హేతుబద్దీకరించాలని నిర్ణయించింది. కొన్ని చిన్న గ్రామాల్లో కూడా 3-4 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో చాలావరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి. వీటి స్థానంలో ఒకే ప్రభుత్వ స్కూలును అన్ని సౌకర్యాలతో, ఎక్కువ మంది ఉపాధ్యాయులతో నడిపించాలని భావిస్తుంది. ప్రతి తరగతికి / సబ్జెక్టు కు ఒక ఉపాద్యాయుడు ఉండేలా తీర్చిదిద్దనున్నారు. వీటికి అనుబంధంగా ప్రీ ప్రైమరీ/ ప్లే స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం శాసన మండలి లోఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ప్రకటన చేశారు.
అంతేకాకుండా భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ స్కూళ్లన్నీ రెసిడెన్షియల్ విధానంలోనే ఉండనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి కొరత ఉందనీ, వీటిని త్వరలో భర్తీ చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానం గా తెలిపారు. రాష్ట్రంలో 2008 నుంచి అమల్లోకి వచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా పెరిగి విద్యా ప్రమాణాలు తగ్గాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment