బాబుగారి అదనపు ఖర్చు 133.05 కోట్లు

బాబుగారి అదనపు ఖర్చు 133.05 కోట్లు
బాబుగారి అదనపు ఖర్చు 133.05 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకన్నా 21,016.20 కోట్ల రూపాయల వ్యయాన్ని అదనంగా చేసామని మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. దీనికి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్‌ను ఆమోదం కోసం సభ ముందు ఉంచారు. ఈ 21 వేల కోట్ల వ్యయంలో ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనలు, పుష్కరాల ప్రచారం, స్వదేశీ మరియు విదేశీ పర్యటనల ఖర్చే 133.05 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా ప్రైవేటు విమానాలకు, క్యాంపు ఆఫీసులకు అయిన ఖర్చు దీనిలో చూపలేదు.

అసలే రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా,  డబ్బులు లేవు. అందువల్ల దుబారా వ్యయం చేయరాదు.. అంటూ చెప్పే ప్రభుత్వం,  ముఖ్యమంత్రే ఈ విధమైన ఖర్చు కొంత తగ్గించుకుంటే బావుంటుంది.

0/Post a Comment/Comments