ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ రాత పరీక్ష

ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ రాత పరీక్ష
ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ రాత పరీక్ష
ఏప్రిల్ 3వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షను ఏప్రిల్‌ 24న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSPRB) సోమవారం ఓ ప్రకటన లో వెల్లడించింది. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య జరగనున్నాయి.
ఏప్రిల్‌ 3న జరగాల్సిన ఈ పరీక్షను అదే రోజు రైల్వే నియామక మండలి (RRB) పరీక్షలు కూడా ఉండటంతో వాయిదా వేసారు. ఎస్సై పరీక్షలు వాయిదా పడ్డాయని వచ్చిన వార్తలు అవాస్తవమని, ఇవి యథాతథంగా ఏప్రిల్‌ 17వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్నామని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post