హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ లో కామెంటేటర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఒక ఆసియా కప్ మ్యాచ్ లో పిచ్ రిపోర్ట్ కోసం పింక్ (గులాబీ రంగు) షర్ట్ వేసుకుని హాజరయ్యాడు. మరో వ్యాఖ్యాత హర్షా భోగ్లే, లక్ష్మణ్ వేసుకున్న పింక్ షర్ట్‌ను గ్లోరియస్ పింక్‌గా అభివర్ణించగా, లక్ష్మణ్ పింక్ తన రాష్ట్ర రంగని వివరించాడు. సరదాగానే అనుకోండి - టిఆరేస్ పార్టీ రంగును రాష్ట్ర రంగు చేసేసాడు. ఈ సందర్భంగా హేడన్ కూడా కలర్ ఫుల్ గా కనిపించే బీచ్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. హర్షా భోగ్లే కూడా హైదరాబాదీ నే కావటం మరో విశేషం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.
Post a Comment