కేసీఆర్ వరాలు - ఎమ్మెల్యేల హర్షం

కేసీఆర్ వరాలు - ఎమ్మెల్యేల హర్షం
కేసీఆర్ వరాలు - ఎమ్మెల్యేల హర్షం
ఇవాళ తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆనందింపచేసే పలు విషయాలను ప్రకటించారు. దీనికి ఎమ్మెల్యేలు అందరూ బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేసారు.
  • శాసనసభ్యులకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధులుకోటిన్నర నుంచి మూడుకోట్లకు పెంచారు. మొదట రెండు కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించగా జానారెడ్డి, లక్ష్మణ్ మరియు ఇతర సభ్యులు విజ్ఞప్తి చేయటంతో దీనిని 3 కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల వేతన సవరణ బిల్లు ఆమోదం పొందటం తో వేతనాలు దాదాపు 2.30 లక్షల రూపాయలకు చేరనున్నాయి.
  • రాష్ట్ర  చీఫ్ సెక్రటరీ హోదా కంటే ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే హోదా పెద్దదనీ, ఈ విషయంలో ఎటువంటి గందరగోళం అవసరం లేదని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారులకు అన్ని రకాల ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు తెలిపారు.
 దీనితో తెలంగాణ అసెంబ్లీలో పెద్దగా విమర్శలు లేకుండానే ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందింది. ఒక్క రేవంత్ రెడ్డి (తెలుగు దేశం పార్టీ) మాత్రమే దీనిని వ్యతిరేకించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post