108 లో అత్యాధునిక పరికరాలు |
ప్రజలకు సేవలందించడానికి ప్రభుత్వం 108 లలో అత్యాధునిక పరికరాలు అమర్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రోగులను హాస్పిటల్ లు తరలించేటప్పుడు సరైన పరికరాలు లేక కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ అవరోధాలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం 108వాహనాలలో వెంటిలేటర్, పల్సీ ఆక్సీమీటర్ లాంటి పరికరాలు అమర్చటంతో పాటు వీటిని జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 145 కొత్త 108 వాహనాలను తెప్పించగా వాటిలో 25 వాహనాలను హైదరాబాద్ కు కేటాయించారు.
ఈ వాహనాలను అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్(ALS ), బేస్ లెవెల్ లైఫ్ సపోర్ట్ (BLS ) వాహనాలుగా విభజించారు. ALS వాహనాలలో వెంటిలేటర్, ఏఈడీ మానిటర్ సౌకర్యాలు ఉండగా BLS వాహనాలలో పల్సీ ఆక్సీమీటర్ అందుబాటులో ఉంచారు. వీటితో గతంలో కన్నా కంటే మరింత వేగంగా, సమర్థంగా సేవలందిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం మరిన్ని వాహనాలను తెప్పించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Post a Comment