కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలకు చెక్ |
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేస్తోంది. పేదింటి అమ్మాయిల పెళ్లి సహాయం కోసం ఉద్దేశించిన ఈ పథకం మరో రకంగా కూడా ఉపయోగపడటం విశేషం. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అయితే వయసు తక్కువగా ఉన్న అమ్మాయిలు దరఖాస్తు చేస్తే ఇది స్వీకరించదు. ఒకవేళ వారు తప్పుడు సమాచారం సమర్పించినా నిర్ధారణ లో దొరికిపోతున్నారు. అయితే కొందరు మైనర్ అమ్మాయిలు తమ దరఖాస్తు ఆన్‌లైన్‌లో అంగీకరించటం లేదని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారి వివరాలను పరిశీలించిన అధికారులు ఆ అమ్మాయిలను మైనర్ అమ్మాయిలుగా నిర్ధారించి పెళ్ళిళ్ళు ఆపివేయించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని వందల పెళ్ళిళ్ళను ఇలా అడ్డుకున్నట్టు సమాచారం. కొంత మంది పేదలు ప్రభుత్వ సహాయం కోసం వారి మైనర్ అమ్మాయిల పెళ్లిని ప్రభుత్వం నిర్దేశించిన వయసు వచ్చేవరకు స్వచ్చందంగా వాయిదా వేస్తున్నారు.
Post a Comment