తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాల పెంపు

తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాల పెంపు
తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాల పెంపు
తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాల పెంపునకు సంబంధించిన బిల్లును తెలంగాణ సర్కారు ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇటీవల శాసనసభ సౌకర్యాల కమిటీ సమావేశమై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 3.5 లక్షల రూపాయలు వేతనంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే  వ్యక్తిగత సహాయకుడి వేతనానికి గాను 25 వేల రూపాయలు ఇవ్వాలని, మరికొన్ని ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది.

దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ గారు జరిపిన సమీక్షలో దేశంలో ఎక్కడా లేనంతగా 3.5 లక్షల వేతనం ఇస్తే విమర్శలు వస్తాయని అధికారులు అభిప్రాయపడడంతో, వేతనం ఇతర అలవెన్సులన్నీ కలిపి 2.5 లక్షల రూపాయలు ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. వాహన రుణాన్ని కూడా 25 లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ 40 లక్షల వాహన రుణాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా నెలకు కనీసం 25 వేల రూపాయల  పింఛను ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

0/Post a Comment/Comments

Previous Post Next Post