పెళ్లి వేడుకల కాల్పుల్లో వరుడి తండ్రి మృతి

పెళ్లి వేడుకల సందర్బంగా విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా గాలిలో తుపాకీతో జరిపిన కాల్పులు పెళ్లి కొడుకు తండ్రి ని బలి తీసుకున్నాయి.   మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని లో జరుగుతున్న ఒక పెళ్లి వేడుకల్లో వరుడి తండ్రి తుపాకుల తో గాల్లోకి కాల్పులు జరపాలంటూ చెప్తుండగా ఒకరి చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయి అతనికే తగిలింది. దానితో అతను అక్కడికక్కడే చని పోయాడు.

ఈ మధ్య ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో వేడుకల సందర్బంగా గాల్లోకి కాల్పులు జరపడం ఓక గొప్పదనం గా భావిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. అయినా ఎవరూ తగ్గటం లేదు.

0/Post a Comment/Comments