గూగుల్ - ఫైబర్ ఫోన్ |
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ‘ఫైబర్ ఫోన్’ పేరుతో కొత్త ల్యాండ్‌లైన్ ఫోన్‌ని అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనితో కేవలం 10 డాలర్ల నెలవారీ చార్జీలతో అమెరికా మొత్తం ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. దీనితో చేసే అంతర్జాతీయ కాల్స్ కి గూగుల్‌వాయిస్‌తో సమానంగా ఛార్జి చేయనున్నారు. అన్ని ఫోన్లలో ఉండే కాల్ బ్లాకింగ్, డునాట్ డిస్ట్రబ్, కాల్ కాన్ఫరెన్స్ లాంటి ఇతర ఫీచర్లు ఈ ల్యాండ్ లైన్‌లో కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ ల్యాండ్‌లైన్‌కి ఫోన్ వస్తే మన మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌ల నుంచి ఆ కాల్‌కి సమాధానం ఇచ్చే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
Post a Comment