హైదరాబాద్ లో అమెజాన్‌ నూతన కార్యాలయం

 హైదరాబాద్ లో అమెజాన్‌ నూతన కార్యాలయం
 హైదరాబాద్ లో అమెజాన్‌ నూతన కార్యాలయం
ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థ హైదరాబాద్ లో నూతన కార్యాలయ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనికి తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. సంస్థ దీర్ఘకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని నిర్మిస్తున్నారు.

 గచ్చిబౌలిలోని పదెకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా వెలుపల అమెజాన్‌ సంస్థ అతి పెద్ద కార్యాలయం ఇదే. సంస్థ గత సంవత్సరమే తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద గోడౌన్ ను ప్రారంభించింది.

గచ్చిబౌలి కార్యాలయ నిర్మాణం 2019 కల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం ఇది కొన్ని వేల మంది కి ఉద్యోగావకాశాల్ని కల్పించనుంది.దీనిని సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ సెంటర్ గా,  ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ అందిస్తున్న సేవలకు బ్యాక్ ఆఫీస్ గా  ఉపయోగించుకోనున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post