2015 లో పిచాయ్ వేతనమెంతో తెలుసా?

2015 లో పిచాయ్ వెతనమెంతో తెలుసా?
2015 లో పిచాయ్ వేతనమెంతో తెలుసా?
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కు 2015 లో వేతనం మరియు ఇతర అలవెన్సుల క్రింద $100.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ లో సుమారు 667 కోట్లు) అందచేసినట్టు  మాతృ సంస్థ ఆల్పాబెట్ రెగ్యూలేటరీ ఫిల్లింగ్స్ లో వెల్లడయింది.

ఈ మొత్తం వేతనంలో ఆయనకు 2017 తర్వాత అమ్ముకోగలిగే వాటాల రూపంలో 99.8 మిలియన్ డాలర్లు (సుమారు 662 కోట్ల రూపాయలు), వేతనంగా  652,500 డాలర్లు (రూ. 4.32కోట్లు), ఇతర అలవెన్సుల రూపంలో 22,935 డాలర్లు లభించాయి.

భారత సంతతికి చెందిన పిచాయ్, 2004లో ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా గూగుల్ లో చేరారు. గూగుల్ క్రోమ్‌, ఆండ్రాయిడ్‌ డెవలప్మెంట్ లో విశేష ప్రతిభ కనబరచిన ఆయన, సంస్థ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా  2015 ఆగస్టులో సీఈవోగా నియమించబడ్డాడు.

0/Post a Comment/Comments