బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్ |
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత నేత బేగం ఖలేదా జియాకు ఢాకా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2015 జనవరిలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు జరిగిన సందర్భంలో ఓ బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి చేసి తగులబెట్టిన ఘటనకు సంబంధించి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసులో ప్రతిపక్ష నేత బేగం ఖలేదా జియాతో సహా ఆ పార్టీ కి చెందిన 27 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. దీనిలో బేగం ఖలేదా జియా నే ప్రథమ ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఈమెకు బెయిల్ వచ్చే అవకాశముందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment