తెలుగు అగ్రిగేటర్లు పని చేయటం లేదు.

తెలుగు అగ్రిగేటర్లు పని చేయటం లేదు.
తెలుగు అగ్రిగేటర్లు పని చేయటం లేదు.
ఏమిటో తెలుగు అగ్రిగేటర్లు గత రెండు మూడు రోజుల నుండి పని చేయటం లేదు. అసలే కూడలి, జల్లెడ ఎప్పుడో పని చేయటం ఆపేయగా మిగిలిన మాలిక, బ్లాగిల్లు కూడా పని చేయటం లేదు. గత అక్టోబర్ లో యాహూ పైప్స్ మూసివేసినప్పుడు కూడా బ్లాగిల్లు పని చేయలేదు. గూగుల్ రీడర్ మూత పడ్డప్పుడు కూడా ఇవి కష్టాలెదుర్కొన్నాయి. ఇప్పుడు పని చేయకపోవటానికి గల కారణాలు తెలియరాలేదు.  ఏది ఏమయినా ఇవి మళ్లీ వాటి సేవలు మొదలు పెడతాయని ఆశిద్దాం.

రెండు మూడేళ్ళ క్రితం వరకూ నేను కనీసం రోజుకు ఒక్కసారైనా కూడలి చూసేవాన్ని. తర్వాత తెలుగు లో రాసేవాళ్ళకు ఆసక్తి తగ్గిపోయిందో ఏమో, బ్లాగులు మెల్లిగా నాణ్యత తగ్గటం, కామెంట్లలో వ్యక్తిగత దూషణలు పెరిగిపోవటం మొదలయ్యాయి. కూడలి ఒక్కటే సొంతంగా RSS ఫీడ్ ను ప్రాసెస్ చేసుకొనేది. మిగిలిన అగ్రిగేటర్లు గూగుల్ రీడర్, యాహూ పైప్స్ వంటి వాటి సేవలు ఉపయోగించుకునేవి. కూడలి మూత పడినప్పుడు బాధ అనిపించింది. నేను కూడలిలా ఒక అగ్రిగేటర్ ను మొదలు పెడదాం అనుకున్నా, కానీ మెల్లిగా మాలిక కు అలవాటు పడ్డాను. కానీ ఇంతకు ముందులా రెగ్యులర్ గా తెలుగు బ్లాగుల్ని చదవట్లేదు.

Update:

మార్చ్ 23వ తేదీ నుండి  మాలిక, బ్లాగిల్లు పనిచేయటం మానేసాయి. ఇవాళ  (30th March) , మాలిక మళ్ళీ పని చేయటం ప్రారంభించింది. బ్లాగిల్లు అడ్మిన్ ఉగాది నుండి కొత్త లుక్ తో మన ముందుకు వస్తామని తెలియచేసారు. ఏది ఏమైనా ఇవి మళ్ళీ పనిచేయటం బావుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post