పాకిస్తానీలు ఇండియా గురించి ఏమనుకుంటారు?

పాకిస్తానీలు ఇండియా గురించి ఏమనుకుంటారు?
పాకిస్తానీలు ఇండియా గురించి ఏమనుకుంటారు?
1970-80 దశకాలలో పాకిస్తానీలని కలిసినప్పుడు ఇండియా పాకిస్తాన్ ల మధ్య పోలిక వస్తే వారిలో కొంత అతిశయం కనిపించేది. వారు పాకిస్తాన్ ఇండియా కన్నా ధనిక దేశమనీ, వారి దేశంలో రోడ్లు, ఇండియా రోడ్ల కన్నా బాగుంటాయనీ, వారి దేశం లో భూమి సారవంతమైనదనీ, అక్కడ మొగవాళ్ళు పొడవుగా ఉంటారనీ, స్త్రీలు అందంగా ఉంటారనీ.... ఇలా ఎన్నెన్నో చెప్పుకొచ్చేవారు.

90 వ దశకం నుండి పరిస్థితి మారుతూ వచ్చింది. ఇండియా సాంకేతికంగా అభివృద్ధి చెందుతుండటం తో పాటు పాకిస్తానీలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావటం తో వారిలో కొంతమంది ఇండియాను ప్రపంచం దృష్టి తో చూడటం ప్రారంభించారు. బాలీవుడ్ సినిమాలు, సంగీతం, ఇండియన్ టీవీ ఛానళ్ళు వారి మధ్య తరగతిలోకి కూడా చోచ్చుకుపోవటం తో వారి దృక్పదం లో మార్పు ఆరంభమైంది.

సామాన్యంగా విదేశాల్లో స్థిరపడిన పాకిస్తానీలు ఇండియా పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగివుంటారు. మా సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేసుకునే దుస్తులు కూడా ఇండియన్లకు దగ్గరగా ఉంటాయి అని అంటారు. 1947 వరకు ఒకే దేశంగా ఉన్న మనకు ఆ మాత్రం దగ్గరితనం సహజమే కదా.

పాకిస్తానీలు కూడా వారికి ఇండియా శత్రు దేశమనే భావన ఉన్నప్పటికీ ఇక్కడ అభివృద్ధినీ, సంస్కృతినీ గమనించగలుగుతున్నారు. ఇక్కడి ప్రజాస్వామ్యం స్థిరంగా ఉండటం, దేశం క్రమంగా అభివృద్ధి చెందుతుండటం, విద్య అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం, సాంకేతికత, ఐటి అభివృద్ధి, వర్క్ కల్చర్ వారికి కూడా సదభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలు, ఇండియన్ టీవీ సీరియల్లయితే వారి జీవితాలలో భాగాలయిపోయాయి.

మనకు పాకిస్తానీల విషయంలో భిన్న అభిప్రాయాలున్నట్టుగానే, పాకిస్తానీలు కూడా ఇండియా గురించి వివిధ అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇక పాకిస్తాన్ లో ఉండే వారిలో కొంత మంది బాలీవుడ్ ప్రాబల్యం ఎక్కువ కావటం తో ఇండియన్ సంస్కృతిని మా మీద రుద్దుతున్నారు అనే వారు కూడా తయారయ్యారు. ఇది కాఫిర్ల దేశమనే  (హిందూ రాజ్యమనే) భావన కూడా అక్కడివారిలో కనిపిస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post