బయట ఉంటాడో.. లోపలుంటాడో

బయట ఉంటాడో.. లోపలుంటాడో
బయట ఉంటాడో.. లోపలుంటాడో
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు.

శనివారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు గబ్బు పట్టిపోతున్నాయి, ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉంటాడో.. ఊడుతాడో.. అసలు .. లోపలుంటాడో..బయట ఉంటాడో.. తెలీకుండా పోతుంది అన్నాడు. ఉభయ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పర్యటించినా ఎక్కడా జగన్‌కు అనుకూల పరిస్థితులు కనబడలేదు అని అన్నారు.

కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గురించి మాట్లాడుతూ గత జనరల్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం కలిపి 6 లక్షల ఓట్లు రాలేదు. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినా ఓట్లు పడలేదు కానీ, కోటి సంతకాలు సేకరించారట.. అబద్ధాలైనా నమ్మేలా చెప్పాలి అన్నారు.

చంద్రబాబు గురించి మాత్రం ఆయన కొరడా తీయాలి, లేకుంటే అంతా నిద్రపోతారు.. ఒక్కడే పని చేస్తే సరిపోదు. ఏపీని అభివృద్ధి చేయాలనే తపన ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ భాగస్వాములను చేయాలి అని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post