మరీ ఇంత బరితెగింపా?

మరీ ఇంత బరితెగింపా?
మరీ ఇంత బరితెగింపా?
కొంతమంది ప్రజా ప్రతినిధులకు నోరు అదుపులో లేకుండా పోతుంది. బీహార్లోని భగల్పూర్ జిల్లాలోని గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదో సారి ఎన్నికైన గోపాల్ మండల్ తనకు హత్యా రాజకీయాలు కొత్త కాదనీ, గతంలో తాను హత్యలు చేసాననీ, ఇప్పుడు మళ్లీ హత్యా రాజకీయాలు చేస్తానని మాట్లాడారు. గోపాల్ సింగ్ పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు వున్నాయి. మరో బీహార్ ఎమ్మెల్సీ రాణా గంగేశ్వర్ సింగ్ భారత జాతీయ గీతం గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. జాతీయ గీతం బానిసత్వానికి ప్రతీక అనీ  అని, దీన్ని మార్చాలని అన్నారు. వీరిద్దరూ అధికార జేడీయూ కు చెందినవారు కావటం మరో విశేషం. 

ఆ రాష్ట్ర జేడీయూ అధ్యక్షుడు వశిష్ట్ నారాయణ్ సింగ్ ను వివరణ అడగగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను వాళ్ళిద్దరినీ పార్టీ నుంచి ఆరేళ్ళపాటు సస్పెండ్ చేసామని చెప్పారు. జేడీయూ కోర్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ గారికి ఈ విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. రాణా గంగేశ్వర్ సింగ్ గతేడాదే బీజేపీలో నుండి  జేడీయూలో చేరటం విశేషం.

0/Post a Comment/Comments

Previous Post Next Post