మోహన్ లాల్ కు జాక్ పాట్

మోహన్ లాల్ కు జాక్ పాట్
మోహన్ లాల్ కు జాక్ పాట్
జనతా గ్యారేజ్‌ సినిమా తో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జాక్ పాట్ కొట్టాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం జనతా గ్యారేజ్‌  సినిమాకు రెమ్యునరేషన్ గా 1.5 కోట్ల రూపాయలతో పాటు మలయాళ హక్కులు  కూడా తీసుకున్నాడట. మోహన్ లాల్ పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా నిర్మాతలు దీనికి ఒప్పుకున్నారు.

మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను ఎన్టీఆర్, సమంతా హీరో, హీరొయిన్లు గా నిర్మిస్తోంది. అయితే మలయాళ రైట్స్ కు 1.5 కోట్లు వస్తాయని భావించిన మైత్రీ మూవీస్, ఏకంగా 4.5 కోట్లు రావటంతో ఒక్కసారిగా షాకయింది. ఏది ఏమైనా మలయాళ సూపర్ స్టార్ ఒకే సినిమాకి 6 కోట్లతో జాక్ పాట్ కొట్టాడట. ఈ హీరో చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో మనమంతా అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post