ఇప్పటికీ పాత నోకియా ఫోన్ వాడుతున్నా

ఇప్పటికీ పాత నోకియా ఫోన్ వాడుతున్నా
ఇప్పటికీ పాత నోకియా ఫోన్ వాడుతున్నా
భారత క్రికెట్ ఆటగాడు ఆశిష్ నెహ్రా ను విలేఖరులు ఆసియా కప్ ఫైనల్ కు ముందు రోజు జరిగిన ధోని, తస్కిన్ల  ఫోటోలతో జరిగిన మార్ఫింగ్ వివాదం గురించి ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా. మీరు రాంగ్ పర్సన్ ను ఈ ప్రశ్న అడుగుతున్నారు, తాను ఇప్పటికీ పాత నోకియా ఫోన్ వాడుతున్నానని, సోషల్ మీడియా గురించి తనకేమి తెలియదని చెప్పటంతో నోరెల్లబెట్టడం విలేఖర్ల వంతయింది.

అంతే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సైట్లలో తనకెటువంటి ఎకౌంట్లు లేవని,  ఇంకా చెప్పాలంటే తాను న్యూస్ పేపర్లు కూడా చదవనని నెహ్రా చెప్పాడు. మార్చ్ 23న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. ఈ సందర్బంగా విలేఖరులు ఆశిష్ నెహ్రా తో మాట్లాడగా ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి  వచ్చాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post