పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖరారు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తంగా 20 ప్యాకేజీలకు గానూ 18 ప్యాకేజీలకు సుమారు 29 వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారయ్యాయి.

ఇది వరకే టెక్నికల్ బిడ్ ల పరిశీలన పూర్తి చేసిన ప్రభుత్వం ఇవాళ ఫైనాన్షియల్ బిడ్ ల పరిశీలన పూర్తి చేసింది . ప్యాకేజీల వారిగా ఆయా కంపెనీలకు టెండర్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది . ప్యాకేజీల వారీగా నవయుగ ఇంజనీరింగ్ , రాఘవ, పీఎస్కేకేఎన్ఆర్, మెగా, ఎస్‌డబ్ల్యూ కంపెనీలకు టెండర్లు ఖరారు చేసింది. ఇంకా మిగిలిన రెండు ప్యాకేజీలకు టెండర్లు ఖరారు కావలసివుంది. 
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖరారు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖరారు

0/Post a Comment/Comments

Previous Post Next Post