చిల్లర్ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రాబ్యాంక్

చిల్లర్ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రాబ్యాంక్
చిల్లర్ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రాబ్యాంక్
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రాబ్యాంక్, ప్రముఖ మొబైల్ పేమెంట్ అప్లికేషన్ అయిన chillr app తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం chillr app డైరెక్ట్ గా ఆంధ్రాబ్యాంక్ ఎకౌంటు తో అనుసంధానం చేయబడుతుంది. దీనితో బ్యాంకు తన వినియోగదారులకు తమ ఫోన్ బుక్ లో ఉన్న ఏ ఫోన్ నెంబర్ కైనా తక్షణం నగదు  బదిలీ చేసే అవకాశాన్ని కల్పించనుంది. ఈ సౌకర్యం భారత దేశంలో ఉండే ఫోన్ నెంబర్లకు మాత్రమే పరిమితం.

చిల్లర్ యాప్ ఆండ్రాయిడ్, ఆపిల్ IOS మరియు విండోస్ లలో లభ్యమవుతుంది. ఎంపిక చేసిన వినియోగదారులతో ఈ సౌకార్యాన్ని పరీక్షించటం మొదలుపెట్టింది. త్వరలో వినియోగదారులందరికీ ఈ అవకాశం లభించనుంది.

0/Post a Comment/Comments