ఆడియో రైట్స్ - ఆడియో ఫంక్షన్స్ |
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే ఆడియో ఫంక్షన్స్ భారీగా జరిగేవి. చిన్న సినిమాలకైతే సింపుల్ గా జరిపేవారు. ఆడియో రిలీజ్ తర్వాత అమ్మకాల్ని బట్టి ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ జరిగేవి. ఈ మద్య ఇంటర్నెట్ విస్తృతమవటం, మెమరీ స్టిక్ ల వాళ్ళ ఆడియో అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. దానితో ఆడియో కంపెనీలు, ప్రొడ్యూసర్లు కూడా యూ ట్యూబ్ ఆడ్ ఇన్ కమ్ పైన దృష్టి పెడుతున్నారు.
ఆడియో మార్కెట్ తగ్గినా చిన్న సినిమాలు ఆడియో ఫంక్షన్స్ ని పెద్ద హీరోలని పిలిచి ఘనంగా చేయటానికి ప్రధాన కారణాలు ఆడియో లైవ్ కవరేజ్ మరియు ప్రచారం. శాటిలైట్ మార్కెట్ విస్తృతమవటం తో చాన్నెల్ల మద్య పోటీ పెరిగి లైవ్ కవరేజ్ కోసం భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలకు ఆడియో అమ్మకాలకన్నా వీటి వల్ల ఎక్కువ మొత్తం లభిస్తుండటం విశేషమే. అలాగే పెద్ద హీరోలు సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పటం వల్ల సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్ళగలుగుతుంది. తర్వాత ప్రచారానికి కూడా వాడుకోవచ్చు.

Post a Comment