హరీష్ రావత్ కు తొమ్మిది రోజుల గడువు

హరీష్ రావత్ కు తొమ్మిది రోజుల గడువు
హరీష్ రావత్ కు తొమ్మిది రోజుల గడువు
10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తో సంక్షోభంలో పడిన ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని మార్చ్ 28 లోగా బల నిరూపణ చేయవలసిందిగా గవర్నర్ కే కే పాల్ కోరారు. దీనితో ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు తొమ్మిది రోజుల గడువు లభించినట్లయింది. శనివారం మధ్యాహ్నం గవర్నర్ ను కలసిన రావత్ తనకు శాసన సభలో మెజారిటీ మద్ధతు ఉన్నట్లుగా తెలియ చేసారు. స్పీకర్ కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. బిజెపి నేతలు గవర్నర్ ను కలిసి తమకు మెజారిటీ ఉందనీ, ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించి, తమకు అవకాశం  ఇవ్వవలసిందిగా కోరారు.

హరీష్ రావత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి నాలుగు సంవత్సరాలయింది. ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపులు వివాదానికి దారి తీస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి వ్యవహారశైలి కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరహాలోనే ఉంది.

Post a Comment

Previous Post Next Post