కోహ్లి మళ్లీ 'ఛేజ్' చేసాడు |
మొదట బాటింగ్ చేసినప్పటి కన్నా రన్ ఛేజ్ చేసేటప్పుడే ఎక్కువ రాణించే విరాట్ కోహ్లి, మరోసారి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేయగా, భారత్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారత్ కు అతి ముఖ్యమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
స్పిన్ కు అధికంగా సహకరించిన ఈ పిచ్ లో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ రన్స్ సాధించటానికి ఇబ్బంది పడింది. చివర్లో ఉమర్ అక్మల్ (16 బంతుల్లో 22), షోయబ్ మాలిక్ (16 బంతుల్లో 26) రాణించటంతో 118 పరుగులు చేయగలిగింది. లక్ష్యఛేదన ప్రారంభించిన భారత్ కూడా 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయం లో కోహ్లి (37 బంతుల్లో 55) తో జత కలసిన యువరాజ్ (23 బంతుల్లో 24) రాణించటం తో విజయం సులభమైంది. ఈ విజయం తో భారత్ 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది.

Post a Comment