 |
అసలు గెలవడానికే ఆడారా? |
బంగ్లాదేశ్ తో ఇండియా క్రికెట్ మ్యాచ్ ను చూస్తే అసలు రెండు జట్లు ఓడిపోవటానికే ఆడినట్లుంది. ఈ మ్యాచ్ వరల్డ్ కప్ కి అవసరమైన ఉత్కంఠను కలిగించినప్పటికీ, అనుకున్నంత ప్రమాణాలతో లేదు. మొదట ఇండియా ధాటిగా ఆడనప్పటికీ, ఈ మ్యాచ్ లో గెలవటానికి అవసరమైన స్కోర్ సాధించింది. తర్వాత ఇండియన్స్ చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలేసి మ్యాచ్ ను దాదాపు చేజార్చారు. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పద్ధతిలో ఒత్తిడిలో వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను ఇండియా కు అప్పగించింది.
ఇక చివరి ఓవర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ ఓవర్ ఎలా బౌలింగ్ చేయకూడదో, ఎలా బ్యాటింగ్ చేయకూడదో చెప్పడానికి ఉదాహరణగా చూపించొచ్చు. హార్దిక్ చెత్త బంతులతో రెండు బౌండరీలు సమర్పించుకున్న తర్వాత బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ ఫుల్ టాస్ బంతులకు ఔటయ్యారు. చివర్లో ధోని సమయస్పూర్తి మెచ్చుకోదగింది. ఈ మ్యాచ్ లో ధోని కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది. ఓడిపోతున్న మ్యాచ్ ను రెండు స్టంపింగ్లు, ఒక రన్ అవుట్ తో గెలిపించాడు.
Post a Comment