విమాన ప్రమాదంలో మాజీ సీఈఓ కుటుంబంతో సహా మృతి

విమాన ప్రమాదంలో మాజీ సీఈఓ కుటుంబంతో సహా మృతి
విమాన ప్రమాదంలోమాజీ సీఈఓ కుటుంబంతో సహా మృతి
బ్రెజిల్ లోని ఉత్తర సావో పోలో లో జరిగిన ప్రమాదంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో బ్రెజిల్ లోని ప్రముఖ మైనింగ్ సంస్థ వేల్ మాజీ సీఈఓ రోజర్ ఆగ్నెల్లి తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇంకా ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.  టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే  ఓ భవనం పై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి  (3:20 pm local time - 00.50 IST) సమయం లో ఈ ఘటన జరిగింది.

రోజర్ ఆగ్నెల్లి బ్యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. వేల్ సంస్థని మైనింగ్ దిగ్గజం గా తీర్చి దిద్దటంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన వయసు 56 సంవత్సరాలు.

0/Post a Comment/Comments