70 కేజీలు తగ్గి సన్నబడ్డాడంట! |
పైన ఉన్న ఫోటో ఒకసారి చూడండి ఐపిఎల్ లో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ముంబయ్ డగౌట్లో ఈ లావుపాటి కుర్రాడు కూర్చునేవాడు. గుర్తున్నాడా?, అతను రిలయన్స్ అధినేత, బిలియనీర్, ముంబయి ఇండియన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ. అప్పుడు చూసినప్పుడు ఇదేమిటబ్బా ఇంత లావుగా ఉన్నాడు అనిపించేది. ఇదే అబ్బాయి శనివారం సోమనాథ్ దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు చూసిన వాళ్ళలో చాలా మంది అతన్ని పోల్చుకోలేకపోయారు. ఊహించలేనంత బాగా సన్నబడిపోయిన ఈయనను చూసి అంతా ఆశ్చర్యం చెందారు.
అప్పట్లో 140 కేజీలు ఉన్న అనంత్ అంబానీ 70 కేజీలకు తగ్గారంట. దీని కోసం అమెరికాకు చెందిన ఒక ప్రముఖ పిట్ నెస్ శిక్షకుడి సహాయం తీసుకున్నాడట. రోజూ వాళ్ళ జామ్ నగర్ రిఫైనరీ లో కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తుతూ విపరీతంగా కష్టపడ్డాడు. ఇంత బరువు తగ్గగలగటం నిజంగా అభినందనీయమే.

Post a Comment