ఆ పదవిని చూస్తే భయపడుతున్నారు |
సాధారణంగా ఎక్కడైనా పిఎసి చైర్మన్ పదవికి పోటీ వుంటుంది. ప్రధాన ప్రతిపక్షానికి దక్కే ముఖ్యమైన పదవి అది. కానీ తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ లో ఈ పదవి పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట కిష్టా రెడ్డి గారు పిఎసి చైర్మన్ గా ఉన్నారు. అయన ఆకస్మిక మరణంతో రాంరెడ్డి వెంకట రెడ్డి గారు ఆ పదవి లోకి వచ్చారు. ఆయనా మరణించటం తో ఇప్పుడు మళ్లీ ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు దురదృష్టం అనే నమ్మకం తో ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపట్లేదు. గీతా రెడ్డి గారు ఈ పదవి తీసుకుంటారని భావిస్తున్నారు.
Post a Comment