సూపర్ ట్యూస్ డే లో ట్రంప్ జయభేరి

సూపర్ ట్యూస్ డే  లో ట్రంప్ జయభేరి
సూపర్ ట్యూస్ డే  లో ట్రంప్ జయభేరి
డోనాల్డ్ ట్రంప్ సూపర్ ట్యూస్ డేన జరిగిన ప్రైమరీ లలో ఫ్లోరిడా, నార్త్ కరోలినా మరియు ఇల్లినాయిస్ రాష్ట్రాలలో విజయం సాధించారు. ఒహియో లో జాన్ కసిచ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విజయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల దిశగా ట్రంప్ మరో ముందడుగు వేసినట్లయింది. అయినప్పటికీ అధ్యక్ష పదవి అభ్యర్థి కి కావలసిన 1,237 డేలిగట్ల మద్దతుకు ఇంకా దూరంలోనే ఉన్నారు. ఒకవేళ ఏ అభ్యర్థి అవసరమైన 1,237 డేలిగట్ల మద్దతు సాధించలేకపోతే రిపబ్లికన్ కన్వెన్షన్ లో అభ్యర్థిని నిర్ణయిస్తారు. పరిశీలకుల అంచనా ప్రకారం పరిస్థితి అంత దూరం వెళితే ట్రంప్ కి అవకాశాలు క్లిష్టమయినట్లే. ఇదిలా ఉండగా డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఫ్లోరిడా, నార్త్ కరోలినా మరియు ఒహియో రాష్ట్రాలలో జరిగిన  ప్రైమరీ లలో విజయం సాధించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post