డ్రైవింగ్ లెసైన్సుల కోసం వెల్లువెత్తుతున్న వాహనదారులు

డ్రైవింగ్ లెసైన్సుల కోసం వెల్లువెత్తుతున్న వాహనదారులు
డ్రైవింగ్ లెసైన్సుల కోసం వెల్లువెత్తుతున్న వాహనదారులు
మార్చ్ ఒకటి నుండి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల విషయంలో కఠినం గా వ్యవహరిస్తుండటం తో వాహనదారులు లెసైన్సుల కోసం క్యూ కడుతున్నారు. ఫిబ్రవరి నెల చివరి వరకు తాత్కాలిక లెసైన్సు కోసం వచ్చే వారి సంఖ్య రోజుకి 600 వరకు ఉండగా, ఈ నెలలో రోజుకి 2000 మంది వస్తున్నారు. సోమవారం రోజు ఏకంగా 2300 మంది తాత్కాలిక లెసైన్సు తీసుకున్నారు.

లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారు తొలిసారి పట్టుబడితే జరిమానాతో వదిలేస్తున్న పోలీసులు, రెండవసారి పట్టుబడిన వారిపట్ల కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తున్నారు. వారికి ఒకరోజు జైలు శిక్ష పడుతుండటంతో  మిగతావారిలో భయం పట్టుకుంది. హైదరాబాద్ లో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 46 లక్షలుండగా, లెసైన్సులు కేవలం 34 లక్షలు మాత్రమే వుండటం గమనార్హం.

0/Post a Comment/Comments

Previous Post Next Post