కెసిఆర్ ప్రాజెక్టులకే బడ్జెట్లో నిధుల్లేవు

కెసిఆర్ ప్రాజెక్టులకే బడ్జెట్లో నిధుల్లేవు
కెసిఆర్ ప్రాజెక్టులకే బడ్జెట్లో నిధుల్లేవు
తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు పరిశీలిస్తే, వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ) కు అసలు నిధులే ఇవ్వకపోవటం, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకానికి కేవలం 860 కోట్లే ఇవ్వటం ఆశ్చర్యం కలిగించక మానదు.

కృష్ణా, గోదావరి నదులు రెండూ ఉన్నా, తెలంగాణ లో చాలా ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం లేదు. వాటర్ గ్రిడ్ అనేది తెలంగాణ ప్రతి ఇంటికీ మంచి నీళ్ళు తెచ్చే బృహత్తర పథకం. ఎన్నికల్లో ఇది కెసిఆర్ ప్రకటించిన ప్రధాన హామీల్లో ఒకటి.  గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికీ 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 150 లీటర్ల మంచినీరు అందించటం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 25000 గ్రామీణ ప్రాంతాల్ని, 67 పట్టణ ఆవాసాల్ని గుర్తించారు. ఐదేళ్ళలో ఈ పథకం పూర్తి కాని ప్రాంతాల్లో ఓటు అడగనని కూడా కెసిఆర్ అనడం ఈ వాటర్ గ్రిడ్ ప్రాధాన్యాన్ని తెలియచేస్తుంది.

ఇక డబల్ బెడ్ రూమ్ విషయానికి వస్తే ఎన్నికలలో పార్టీకి ఓట్లు తెచ్చిన, ఉప ఎన్నికలలో ఇంకా ఓట్లు తెస్తున్న పథకం. ఈ సంవత్సరం ప్రకటించిన విధంగా రెండు లక్షల ఇళ్ళు (వాస్తవానికి ఈ సంఖ్య కూడా ప్రజలకు సరిపోదు) కట్టాలంటే కేంద్రం నుండి వచ్చే నిధులు కాకుండా కనీసం 12 వేల కోట్లు అవసరం.

ఈ విషయమై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారిని సంప్రదిస్తే ఈ రెండు ప్రాజెక్టులకు బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు నిధులు సమకూరుస్తాయని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు నాబార్డ్, బ్యాంక్ అఫ్ ఇండియా మరియు కెనరా బ్యాంక్ నిధులు సమకూరుస్తున్నాయనీ, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు హడ్కో ఋణం అందచేస్తుందనీ తెలియచేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post