భారతీయ విద్యార్థులకు అబ్దుల్ కలాం ఫెలోషిప్ ప్రకటించిన అమెరికా |
ప్రముఖ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్ధం భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం ఓ ఫెలోషిప్ ను ప్రకటించింది. ఇది భారత్, అమెరికా మధ్య పౌర సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం కోసం రెండు దేశాల ప్రభుత్వాలు కలసి నిధులు సమకూర్చనున్నారు. ఈ పథకం పేరు ‘ఫుల్‌బ్రైట్ కలామ్ క్లైమేట్ ఫెలోషిప్’ గా నిర్ధారించారు. దీని ద్వారా అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీలో శాస్త్ర పరిశోధనను పూర్తి చేయటానికి ఆరుగురు భారతీయ పీహెచ్‌డీ విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఫెలోషిప్ ను యూఎస్ - ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (USIEF ) పర్యవేక్షించనుంది.
Post a Comment