మరికొన్ని గంటల్లో తెలంగాణ బడ్జెట్

మరికొన్ని గంటల్లో తెలంగాణ బడ్జెట్
మరికొన్ని గంటల్లో తెలంగాణ బడ్జెట్
-  బడ్జెట్ కు రాష్ట్ర కాబినెట్ ఆమోదం
-  ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం కన్నా ఎక్కువ ఉండేలా కసరత్తు (67,660 కోట్లు Vs 60,000 కోట్లు)
-  అసెంబ్లీలో  ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, శాసన మండలిలో కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు
-  నీటి పారుదలకే పెద్దపీట.. రూ.25 వేల కోట్లు కేటాయింపు
-  కల్యాణలక్ష్మి విస్తరణ - అన్ని వర్గాల పేదలకు వర్తింపు
-  కాలేజీ విద్యార్థులకు కూడా సన్నబియ్యం తో కూడిన భోజనం
-  ప్రజారోగ్య రంగానికి కేటాయింపులు పెంపు

బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ  అసెంబ్లీలో తమ మూడో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొదటి రెండేళ్లపాటు వాస్తవికతకతకు దూరంగా భారీ అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన  ప్రభుత్వం ఈసారి పంథాను మార్చుకోనుంది . గత ఏడాది కేటాయింపులతో సంబంధం లేకుండా జీరో బేస్డ్ బడ్జెట్‌ను  ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇప్పటికే ప్రకటించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ 1.27 లక్షల కోట్ల ఉండనుంది. 14వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం FRBM పరిమితిని  పెంచుకునేందుకు ద్రవ్యలోటు ఉన్నప్పటికీ రెవెన్యూ మిగులు చూపించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపనుంది.

ఆదివారం అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం 11.35 కు ముహూర్తం గా నిర్ణయించారు. అసెంబ్లీ  లో ఈటెల రాజేందర్, శాసన మండలిలో కడియం శ్రీహరి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ బడ్జెట్లో కేటాయింపుల అంచనాలు ఈ విధంగా ఉండనున్నాయి.

సాగునీటికి ప్రాజెక్టులకు - 25 వేల కోట్లు
వైద్య ఆరోగ్య రంగానికి  -  5 వేల కోట్లు
మూడో విడత రైతుల రుణమాఫీకి - 4వేల+ కోట్లు

0/Post a Comment/Comments

Previous Post Next Post