ఇలాంటి ఒప్పందాలేమిటో?

ఇలాంటి ఒప్పందాలెందుకో?
ఇలాంటి ఒప్పందాలేమిటో ?
నవభారత్ వెంచర్స్ కంపెనీకి 135 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఉంది. ఇంకా కొంత క్యాప్టివ్ మిగులు ఉండవచ్చు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ అంటే ఒక పరిశ్రమ తన సొంత అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్. దీనిని అమ్మటానికి విద్యుత్ లోటు ఉన్న తెలంగాణా డిస్కంలతో ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సంస్థ డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందం ఎంత విద్యుత్ అమ్మటానికో తెలియ రాలేదు. సంస్థ ప్రతినిధి ఈ విషయం చెప్పటానికి నిరాకరించారు కానీ యూనిట్ ధర ఐదు రూపాయలని తెలిపారు. మరి అదనపు విద్యుత్ ఎలా సరఫరా చేస్తారు అనే కదా సందేహం. దీని కోసం నవభారత్ వెంచర్స్ ఈ మద్య టాటా పవర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టాటా పవర్ కు దక్షిణ భారత దేశం లో సరఫరా చేయటానికి విద్యుత్ ఏమీ లేదు. టాటా పవర్ సంస్థ గ్రిడ్ నుండి విద్యుత్ కొనటానికి ట్రేడింగ్ పార్టనర్ గా నవభారత్ కు సహాయ పడనుంది. టాటా పవర్ కు దీనిలో కమీషన్ ముడుతుంది. ఇదిలా ఉండగా ఈ ఒప్పందం వల్ల మార్చ్ 21న నవభారత్ వెంచర్స్ షేర్ వ్యాల్యూ ఒకేరోజు 2.36% పెరిగింది.

ఈ మల్టీ లెవల్ ఒప్పందాలెందుకో? డిస్కంలు డైరెక్ట్ గా గ్రిడ్ నుండి విద్యుత్ కొనలేవా? ఉత్తర భారతం లో 3 రూపాయలు ఉన్న యూనిట్ ధర, కొరత, ఇంకా గ్రిడ్ కు పూర్తి స్థాయిలో అనుసంధానం కాకపోవటం తో ఇక్కడ అయిదు రూపాయలు పెట్టికొన వలసి వస్తుంది.
Labels:

Post a Comment

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget