రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఖర్చుతోనే స్పైస్ పార్క్ |
కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడిగల్‌లో స్పైస్‌పార్కును రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ గ్రామం బాల్కొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 30కోట్ల వ్యయం తో వచ్చే రెండేళ్లలో పార్కు నిర్మాణం పూర్తికానుంది. రాష్ట్రం లోని సుగంధ ద్రవ్యాల రైతులకు ముఖ్యంగా పసుపు రైతులకు ఈ పార్క్ సహకారం అందించనుంది.
ప్రతీ రాష్ట్రంలో ఒక స్పైస్ పార్క్ ఉండాలని 11వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరైన స్పైస్ పార్క్ గుంటూరు జిల్లాలో నెలకొల్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటంతో తమకు కూడా ఒక స్పైస్ పార్క్ కావాలని కోరినా కేంద్రం స్పందించలేదు.

Post a Comment