పూనం "వర్మ" కబుర్లు

పూనం "వర్మ" కబుర్లు
పూనం "వర్మ" కబుర్లు
తనకు రాంగోపాల్ వర్మ ఎటాక్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సంతోష పడుతూ చెప్పింది నటి పూనం కౌర్. రాము గారు తనకు కాల్ చేసి నువ్వు నెగెటివ్ పాత్రలు చేస్తావా అని అడిగారట.

పనిలో పనిగా వర్మను తెగ పొగిడేసింది. ఈ దర్శకుడు నటులను అందరిలా కాకుండా భిన్నంగా ఊహించుకోగల సమర్థుడని అంది. ఈ చిత్రంలో పాత్ర గురించి చెప్పినప్పుడు ఈవిడ నేను ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలే చేసాను అని అంటే రాము గారు మరేం పర్లేదు అన్నాడట. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే దర్శకత్వం గురించి ఏంతో తెలుసుకుందిట. ఒక రోజు రాము గారు ఈవిడని నువ్వు 1940 లలో పుట్టాల్సింది, అన్నీ నానమ్మ అలవాట్లు వున్నాయి అన్నాడట. తను దైవ భక్తురాలు కావటంతో అలా అనిపించిందేమో అంది. ఇంతకు ముందే రాము గారితో చేయాల్సిందట. ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ మీదకి రాలేదట. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ భామ ఈ పాత్ర కోసం పని చేసింది మూడు రోజులేనట.

0/Post a Comment/Comments

Previous Post Next Post