పఠాన్‌కోట్‌లో అపహరించిన కారును వదిలివెళ్ళిన దుండగులు |
పఠాన్‌కోట్‌లో ఈ నెల 22న అపహరింపబడిన కారు లభ్యమైంది. గురుదాస్‌పూర్‌లోని పశ్యాల్ గ్రామంలో దుండగులు ఈ కారు ను వదిలిపెట్టి వెళ్లారు. ఒక వ్యక్తిని తుపాకితో బెదిరించి ముగ్గురు దుండగులు PB 06 S 8982 నంబరు గల కారును అపహరించిన సంగతి తెలిసిందే. పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్సు బేస్ పై దాడికి ముందు కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరగటం తో పోలీసులు, ఆర్మీ అలర్టయి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడం తో పాటు కీలక ప్రాంతాల వద్ద భద్రత పెంచారు. అపహరించిన దుండగుల ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Post a Comment