జమ్ము కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా |
మెహబూబా ముఫ్తీ ని జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ఎన్నుకోవటానికి రంగం సిద్ధమైంది. గురువారం రోజు శ్రీనగర్ లో సమావేశమైన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (PDP) ఎమ్మెల్యేలు మెహబూబా ను తమ పార్టీ శాసన సభా నేతగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్ళుగా బిజెపి తో నెలకొన్న ప్రతిష్టంబన తొలగిపోవటం తో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మెహబూబా ముఫ్తీ ఇవాళ గవర్నర్ వోహ్రా ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ సత్పాల్ శర్మ కూడా ఇవాళ గవర్నర్ ను కలిసి పిడిపి ప్రభుత్వానికి మద్దతు తెలుపనున్నారు. మెహబూబా తండ్రి గారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ జనవరి 7 న చనిపోయినప్పటి నుండి ఇక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

Post a Comment