తెలంగాణ మరో కాలిఫోర్నియా కానుందా?

తెలంగాణ మరో కాలిఫోర్నియా కానుందా?
తెలంగాణ మరో కాలిఫోర్నియా కానుందా?
గూగుల్, ఆపిల్, అమేజాన్ మరియు ఉబెర్ ఇవి ఈ సంవత్సర కాలంలో తెలంగాణ కి వచ్చిన పెద్ద కంపనీ లలో కొన్ని. రావటమే కాకుండా అమెరికా బయట తమ అతిపెద్ద ఆపరేషనల్ సెంటర్ గా హైదరాబాద్ ను ఎంచుకున్నట్టు ప్రకటించాయి. ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్, క్వాల్ కాం  లకు కూడా ఇప్పటికే హైదరాబాద్ లో ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నీ 5-10 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. తెలంగాణ ఐటి వర్గాలు భవిష్యత్తు లో తెలంగాణ మరో కాలిఫోర్నియా కానుందనే అంటున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా ఇన్ని పెద్ద ఐటి కంపెనీలు ఒక దగ్గర లేవు. ఈ సంవత్సర కాలం లో హైదరబాద్ ఐటి రంగంలో ఉత్సహ భరితమైన  వాతావరణం నెలకొనటం విశేషం.

తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ మాటల్లో చెప్పాలంటే హైదరాబాద్ తనలో పెట్టుబడి పెట్టే  ప్రతి రూపాయికీ అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం తెలంగాణ లో 40 వేల ఐటి ఉద్యోగాలు, లక్ష వరకు ఐటి ఆధారిత ఉద్యోగాలు కొత్తగా కల్పించినట్టు అంచనా. అలాగే గత సంవత్సరం ఐటి ఎగుమతుల వృద్ధి రేటు దేశ వ్యాప్తంగా 13% మాత్రమే ఉండగా, రాష్ట్రం లో 16% ఉంది. ఈ సంవత్సరం ఇది మరింతగా పెరగనున్నట్టు అంచనా.  దీనికి అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం, సత్వర నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం, స్థిరమైన పరిస్థితులు నేలకొనటం, మానవ వనరుల లభ్యత, మెట్రో పట్టణాలన్నింటి లోకి తక్కువ జీవన వ్యయం, యువ ఐటి శాఖా మంత్రి లను కారణాలుగా చెప్పుకోవచ్చు. ఐటి కంపెనీలే కాకుండా విమానయాన విభాగంలో ఎయిర్ బస్, ఫర్నిచర్ దిగ్గజం ఐకియా కూడా ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post