పాస్ పోర్ట్ కోసం కోర్టుకు

పాస్ పోర్ట్ కోసం కోర్టుకు
పాస్ పోర్ట్ కోసం కోర్టుకు
1993 వరుస బాంబు పేలుళ్ళ కేసులో శిక్షననుభవించి ఇటీవలే ఎరవాడ జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన పాస్ పోర్ట్ ను వెనక్కి ఇవ్వాల్సిందిగా టాడా కోర్ట్ ను అభ్యర్థించాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ సాల్వి తెలిపిన వివరాల ప్రకారం వారు నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసారు. టాడా కోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది.

ఈ బాలీవుడ్ కథానాయకుడు ఏప్రిల్  19, 1993 న అక్రమంగా  AK-56 రైఫిల్ కలిగి ఉన్నందుకు అరెస్టయ్యాడు. తరువాత విచారణలో ఆ రైఫిల్ 1993 బాంబు పేలుళ్ళ కు కారణమైన పేలుడు పదార్థాల తో పాటుగా దేశం లో ప్రవేశించినట్టు తేలింది.  జూలై 31, 2007 లో టాడా కోర్టు అక్రమ ఆయుధాల కేసులో ఆరేళ్ళ జైలుశిక్ష విధించింది. 2013 లో సుప్రీమ్ కోర్టు ఈ శిక్షను ఐదేళ్లకు తగ్గించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post