బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు |
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని జావెంటెమ్ విమానాశ్రయంలో రెండు పేలుళ్లు సంభవించాయి. బెల్జియం స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు రెండు భారీ పేలుళ్ళు సంభవించాయి. దీనితో ప్రయాణికులను ఖాళీ చేయించి, విమానాశ్రయాన్ని మూసివేసి రాకపోకలను నిషేధించారు. ఈ పేలుళ్ళలో 14 మంది మరణించగా , 25 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పారిస్ పేలుళ్ళ నిందితుడు సలాహ్ అబ్దెస్లామ్ ను ఇక్కడ పట్టుకున్న తర్వాత నాలుగు రోజులకే ఈ పేలుళ్లు జరగటం గమనార్హం.
Post a Comment