సంక్షోభంలో ఫెర్రో-అల్లాయ్స్ పరిశ్రమ

సంక్షోభంలో ఫెర్రో-అల్లాయ్స్ పరిశ్రమ
సంక్షోభంలో ఫెర్రో-అల్లాయ్స్ పరిశ్రమ
విద్యుత్ చార్జీలు తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఉన్న ఫెర్రో-అల్లాయ్స్ పరిశ్రమలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.  ఈ పరిశ్రమలోని మొత్తం ఉత్పాదక ఖర్చులో 60% విద్యుత్ బిల్లులే కావటం విశేషం. 2012 లో 2.65 రూపాయలు గా ఉన్న పరిశ్రమల విద్యుత్  టారిఫ్  4.80 రూపాయలకు పెరగటంతో వీటికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే 45 పరిశ్రమలు (ఆంధ్ర ప్రదేశ్ లో 35, తెలంగాణాలో 10 ) మూతపడ్డాయి. దాదాపు 50 వేల మంది (ఆంధ్ర ప్రదేశ్ లో 40వేలు, తెలంగాణాలో 10 వేలు) నిరుద్యోగులయ్యారు.

తెలంగాణాలో ఈ పరిశ్రమ విద్యుత్ అవసరాలు 74 మెగా వాట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ లో 400 మెగా వాట్లు. ఈ పరిశ్రమల ఉత్పత్తులు ప్రధానంగా ఉత్తర కొరియా, ఇండోనేషియా, మరియు  జపాన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రపంచం లో అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు కలిగి ఉన్నామని చెప్పుకునే ఈ రెండు రాష్ట్రాలు ఈ పరిశ్రమను ఆదుకోవాలని ఫెర్రో-అల్లాయ్స్ పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post